LetrasNuvvante Nakishtamani

Telugu

Última atualização em: 21 de Julho de 2017
Estas letras estão à espera de revisão
Se encontrou erros, por favor ajude-nos corrigindo-os.

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ నీ నవ్వులో శృతి కలిపి పాడగా

నీ నీడలో అణువణువు ఆడగా అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ నువ్వు నా వెంట ఉంటె అడుగడుగునా నడుపుతుంటే ఎదురయే నా ప్రతి కళ నిజమల్లె కనిపించదా నిన్నిలా చూస్తూ ఉంటె మైమరపు నన్నల్లుతుంటే కనపడే నిజమే ఇలా కలలాగా అనిపించదా వరాలన్నీ సూటిగా ఇలా నన్ను చేరగా సుదూరాల తారక సమీపాన వాలగా లేనేలేదు ఇంకే కోరికా... నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం నిన్నగా సన సన్నగా చేజరిపోనీయకా... చూడు నా ఇంద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం రేపుగా మన పాపగా పుడుతుంది సరి కొత్తగా నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా ప్రతీ రేయి తీయగా పిలుస్తోంది హాయిగా ఇలా ఉండిపోతే చాలుగా... నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ ఈ నవ్వులో శృతి కలిపి పాడగా ఈ నీడలో అణువణువు ఆడగా అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ (దిలీప్ చక్రవర్తి)

  • 8

Últimas atividades

Tradução porPrathyusha Reddy

O Musixmatch para Spotify e
iTunes está agora disponível para
o seu computador

Descarregar agora