LetrasNe Tolisariga

Telugu

Última atualização em: 21 de Julho de 2017
Estas letras estão à espera de revisão
Md.abdul khadir Khadir sugeriu alterações a esta letra.

నే తొలిసారిగ కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగ నిలిచున్నది నువ్వే కదా స్వప్నమా, నువ్వు సత్యమా తేల్చి చెప్పవే ప్రియతమా మౌనమో, మధుర గానమో తనది అడగవే హౄదయమా ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా రెక్కలు తొడిగిన తలపు నువే కాదా నేస్తమా ఎక్కడ వాలను చెప్పు నువే సహవాసమా హద్దులు చెరిపిన చెలిమి నువై నడిపే దీపమా వద్దకు రాకని ఆపకిలా అనురాగమా నడకలు నేర్పిన ఆశవు కదా తడబడనీయకు కదిలిన కధ వెతికే మనసుకు మమతే పంచుమా ప్రేమా నీతో పరిచయమే ఎదో పాపమా అమౄతమనుకొని నమ్మటమే ఒక శాపమా నీ ఒడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా పెదవులపై చిరునవ్వుల దగా కనపడనీయవు నిప్పుల సెగ నీటికి ఆరని మంటల రూపమా నీ ఆటెఏమిటో ఏనాటికి ఆపవు కదా నీ పాటేమిటో ఏ జంటకి చూపవు కదా తెంచుకో నీవు పంచుకో నీవు ఇంత చెలగాటమా చెప్పుకో నీవు తప్పుకో నీవు నీకు ఇది న్యాయమా పేరులో ప్రణయమా, తీరులో ప్రళయమా... పంతమా బంధమా... నే తొలిసారిగ కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగ నిలిచున్నది నువ్వే కదా (దిలీప్ చక్రవర్తి)

  • 0

Últimas atividades

Tradução porPrathyusha Reddy

O Musixmatch para Spotify e
Apple Music está agora disponível para
o seu computador

Descarregar agora