Paroleskrishnam vande jagadgurum

S. P. Balasubrahmanyam

Dernière mise à jour le: 26 juillet 2019
1 traduction disponible ||| 1 traductions disponibles1 traduction disponible ||| 1 traductions disponibles
Ces paroles sont en attente de révision
Kolluri satya surya narayana murthy suggested changes to these lyrics.

జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం పురాతనపు పురాణ వర్ణన పైకి కనపడుతున్న కథనం నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం చెలియలి కట్టను తెంచుకుని, విలయము విజ్రు౦భించునని ధర్మ మూలమే మరచిన జగతిని యుగాంత మెదురై ముంచునని సత్యం వ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూత నిచ్చి నావగా త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం చేయ దలచిన మహాత్కార్యము మోయజాలని భారమైతే పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించ గలిగిన ఓరిమి కూర్మమన్నది క్షీరసాగర మథన మర్మం ఉనికిని నిలిపే ఇలను కడలిలో కల్పగా నురికే ఉన్మాదమ్మును నరాల దంష్ట్రుల ఉల్లగించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల ధీరోద్ధరితరిణ హుంకారం ఆది వరాహపు ఆకారం ఏడి ఎక్కడ రా? నీ హరి దాక్కున్నాడే రా? భయపడి బయటకు రమ్మనరా ... ఎదుటపడి నన్ను గెలవగాలడా! తలపడి? నువ్వు నిలిచిన ఈ నేలను అడుగు నాడుల జీవ జలమ్ము ని అడుగు నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు నీ ఊపిరిలో గాలిని అడుగు నీ అడుగులో ఆకాశాన్నడుగు నీలో నరుని హరిని కలుపు నీవే నరహరివని నువ్ తెలుపు ఉన్మత్త మాతంగ బంధికాతుక వికతి హంత్రు సంక్రాతనీ క్రుడని విడనీ జగతి అహము రధమై యెతికె అవనికిదె అసనిహతి ఆకతాయుల నిహతి అనివర్యమవు నియతి శిత హస్తి హత మస్త కారినక సవకాసియో క్రూరాసి క్రోసి హ్రుతదాయ దంష్ట్రుల దోసి మసి చేయ మహిత యజ్ఞం అమేయమనూహ్యమనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం జగ జగ జగ జగ జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం జగ జగ జగ జగ జగమే నాటకం పాపపు తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మగ్లానిని పెరుకగ పరశురాముడై భయదభీముడై పరశురాముడై భయద భీముడై ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన శ్రోత్రియ క్షత్రియ తత్వమె భార్గవుడు ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మశక్యము గాని ఏ మర్మమూ లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగ మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచే ఇన్ని రీతులుగ ఇన్నిన్ని పాత్రలుగ నిన్ను నీకే నూత్న పరిచితునిగ దర్శింపజేయగల జ్ఞాన దర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణతరణము అణిమగా... మహిమగా... గరిమగా... లఘిమగా... ప్రాప్తిగా... ప్రాకామ్యవర్తిగా... ఈశత్వముగా... వశిత్వమ్ముగా... నీలోని అష్తసిద్ధులు నీకు కన్వట్టగా స్వస్వరూపమే విశ్వరూపమ్ముగా నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగ తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం... కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం... కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం

1 traduction disponible ||| 1 traductions disponibles1 traduction disponible ||| 1 traductions disponibles
  • 299

Dernières activités

Synchronisées parranjithkumar mudrakola
Traduites parPhani Deepak Gaddam

Musixmatch pour Spotify et
iTunes sont désormais disponible pour
votre ordinateur

Télécharger maintenant